బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది: ఈటల జామున

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఆయన సతీమని మద్దతుగా నిలచారు.

Update: 2024-04-07 06:55 GMT

దిశ, మేడ్చల్ టౌన్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఆయన సతీమని మద్దతుగా నిలచారు. ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళ ఆత్మీయ సమ్మేళనంలో ఈటల జామున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మల్కాజిగిరి ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈటల జామున కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, కౌన్సిలర్లు అమరం సరస్వతి, సముద్రాల హంసారాణి, దొడ్ల మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నవాణిత, నాయకులు రవీందర్ గౌడ్, కిషన్, శ్రీధర్,నవీన్,నాగరాజు,విక్రమ్, అరుణ్,అభిలాష్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News