బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్​తోనే సాధ్యం : బండి రమేష్​

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి బండి రమేష్​ అన్నారు.

Update: 2023-11-25 14:52 GMT

దిశ, కూకట్​పల్లి : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి బండి రమేష్​ అన్నారు. మూసాపేట్​ డివిజన్​ పరిధి గూడ్​ షెడ్​ రోడ్డులో శనివారం హమాలి సంఘం సభ్యులతో బండి రమేష్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హమాలి సంఘం నాయకులు బండి రమేష్​కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్​ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్​ పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్​ మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు, అసంఘటిత కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్​ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణలో రానుంది ముమ్మాటికి కాంగ్రెస్​ ప్రభుత్వమని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్​ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వంత ప్రయోజనాలే తప్ప వారికి ఏది ప్రాధాన్యం కాలేదని అన్నారు. కూకట్​పల్లిలో మహాలీలు కనీసవసతులు లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. కార్మికలోకానికి పీజేఆర్​ వంటి మహానాయకుడిని అందించింది కేవలం కాంగ్రెస్​ పార్టీయేనని అన్నారు. పీజేఆర్​ అనంతరం కార్మికుల సమస్యల పై పోరాడిన, మాట్లాడిన వారు లేరని, కూకట్​పల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తే పీజేఆర్​ను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని, బడుగు బలహీన వర్గాలు, కార్మిక లోకానికి అందుబాటులో ఉండి వారికి సేవలను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు నర్సింహా, శంకర్, రాజు, సచిన్, రేష్మ, మేసయ్య, రాఘవేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News