ఫ్లైఓవర్​ కింద ఖాళీ ప్రదేశంలో ఇండోర్​ క్రీడా ప్రాంగణం

క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా కేపీహెచ్​బీ కాలనీ ఫ్లైఓవర్​ బ్రిడ్జి కింద ఇండోర్​ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-08-10 12:55 GMT

దిశ, కూకట్​పల్లి : క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా కేపీహెచ్​బీ కాలనీ ఫ్లైఓవర్​ బ్రిడ్జి కింద ఇండోర్​ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్​బీ డివిజన్​ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​ రావు, జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. డివిజన్​ పరిధిలోని మలేషియన్​ టౌన్షిప్​ వెకనకాల 5 ఎకరాలలో చేపడుతున్న పార్కు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పక్కనే ఉన్న మరో ఐదు ఎకరాల స్థలంతో పాటు తొమ్మిదవ ఫేజ్​లోని మూడు ఎకరాల స్థలాన్ని జీహెచ్​ఎంసీ లేదా హెచ్​ఎండీ ఆధ్వర్యంలో ప్రత్యేక పార్కులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలో

    అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి, జిల్లా మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. వన్​సిటీ పక్కనే ఉన్న హౌసింగ్​ బోర్డు స్థలాన్ని మహిళా పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు రోడ్డుపై నీళ్లు నిలవకుండా ఉండేలా వాటర్​ హార్వెస్టింగ్​ పిట్స్​ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఫోరం మాల్​ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్​ బ్రిడ్జి కింద ఖాళీ స్థలాన్ని ఇండోర్​ క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 4వ ఫేజ్​లోని ఎస్​టీపీ ప్లాంట్​ వద్ద ఫ్లైఓవర్​ కింద ఉన్న చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా పనులను చేపట్టాలని సూచించారు. కేపీహెచ్​బీ డివిజన్​లో వేల కోట్ల రూపాయలతో గత పది ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్​ సర్కిల్​ ఈఈ శ్రీనివాస్, డీఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్, యూబీడీ అధికారి సమత, జలమండలి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెంకటేష్, రాజేష్​, భవాని పాల్గొన్నారు. 

Tags:    

Similar News