తప్పులు లేకుండా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలి
ఎటువంటి తప్పులు లేకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలను నమోదు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త పేర్కొన్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : ఎటువంటి తప్పులు లేకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలను నమోదు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త పేర్కొన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ నిజాంపేట కార్పొరేషన్ ప్రాంతాల్లో శుక్రవారం ఆమె సర్వే తీరును పరిశీలించారు. సర్వే సమయంలో ఎన్యుమరేటర్స్ ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు.
వాటిని ఏ విధంగా నమోదు చేసుకుంటున్నారు..? వంటి అంశాలను పరిశీలించారు. ఎన్ని కుటుంబాలను సర్వే కోసం కేటాయించారు, రోజుకి ఎన్ని ఇండ్లను సర్వే చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా త్వరలో జరగనున్న గ్రూప్ 3 పరీక్షకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఆమె సందర్శించారు.