సమగ్ర, శక్తివంతమైన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి: ఆర్ఎస్ఎస్ రాష్ట్ర బౌద్ధిక్ ప్రముఖ్ జయదేవ్

సమగ్ర, శక్తివంతమైన భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర బౌద్ధిక్ ప్రముఖ్ జయదేవ్ పిలుపునిచ్చారు.

Update: 2023-04-23 14:58 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సమగ్ర, శక్తివంతమైన భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర బౌద్ధిక్ ప్రముఖ్ జయదేవ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ జిల్లా మహా సంఘీక్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అయితే, భారత్ కు హిందూ సమాజం ఆధారమని అన్నారు. హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ఎస్ఎస్ 90 ఏళ్లకు పైగా కృషి చేస్తోందన్నారు.

కులం, ప్రాంతం, భాష, మొదలైన విభేదాలను పక్కన పెట్టి మనమంతా హిందువులమనే విషయాన్ని గుర్తించాలన్నారు. విభజన వాదాన్ని రెచ్చగొట్టే విధానం సెక్యులర్ గా గుర్తింపు పొందుతుంటే, సమైక్య, సంఘటిత వాదాన్ని గుర్తు చేయడం మతతత్వం, కమ్యూనల్ గా ప్రచారం జరగడం పట్ల అవేదన వ్యక్తం చేశారు. భేద భావాలు, హెచ్చు తగ్గుల భావాలు లేని హిందూ సమాజాన్ని నిర్మాణమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, లక్ష్యమన్నారు.

ఆర్ఎస్ఎస్ నిర్వహించే శాఖలలో పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ విభాగ కార్యవాహ బోల నాగభూషణం, మెదక్ విభాగ్ ప్రచారక్ సత్యంజీ, మెదక్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ గోల్కొండ రాఘవులు, జిల్లా కార్యవాహ మల్యాల ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News