అగ్నికి ఆహుతి కావాల్సిందేనా?

చేర్యాల పాత నియోజక వర్గం పరిధిలో ఫైర్ స్టేషన్ అందుబాటులో లేక అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ,ఆస్తి నష్ట పోతున్నారు.

Update: 2025-03-28 09:49 GMT
అగ్నికి ఆహుతి కావాల్సిందేనా?
  • whatsapp icon

దిశ, చేర్యాల: చేర్యాల పాత నియోజక వర్గం పరిధిలో ఫైర్ స్టేషన్ అందుబాటులో లేక అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ,ఆస్తి నష్ట పోతున్నారు.. చేర్యాల మండల, మున్సిపల్ పరిధిలో అధిక సంఖ్యలో రైస్,పత్తి మిల్లులు, షాపింగ్ మాల్స్ తోపాటు బార్ అండ్ రెస్టారెంట్లలో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నికి ఆహుతి కాక తప్పని పరిస్థితి..వీటిలో అనుకోకుండ జరగరాని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ సుమారు 30 కిలోమీటర్ల నుంచి రావాల్సి ఉండటంతో అనేక సందర్భాల్లో ఫైర్ ఇంజన్ వచ్చేసరికే పెద్దమొత్తంలో ఆస్తి నష్టం జరిగిన సంఘటనలు లేకపోలేదు.ఇది ఇలా ఉంటే రైతులు వ్యవసాయ బావుల వద్ద అగ్ని ప్రమాదాలు జరిగి పశుగ్రాసం కాలిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇప్పటికైనా సంబధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చేర్యాల మున్సిపల్ కేంద్రానికి ఫైర్ ఇంజన్ కేటాయిస్తే చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

అధికారులు స్పందించి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

సీపీఎం మండల కార్యదర్శి బండకింది అరుణ్

చేర్యాల ప్రాంతంలో ఫైర్ స్టేషన్ లేక అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ఆస్తి నష్టం జరుగుతుంది.సిద్ధిపేట,జనగామ జిల్లా కేంద్రాల నుంచి ఫైర్ ఇంజన్ ఆలస్యంగా వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరుగుతుంది.ఇప్పటికైనా చేర్యాలకు ఫైర్ స్టేషన్ మంజూరు అయ్యేలా అధికారులు,ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.

Similar News