గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్…

మునిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో నిషేదిత 500 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-11-21 15:09 GMT

దిశ, మునిపల్లి : మునిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో నిషేదిత 500 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల కంకోల్ డెక్కన్ టోల్ ప్లాజా టోల్ గేట్ ముందు ఎన్ హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బీదర్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న కారులో ఉన్న 500 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్బంగా కొండాపూర్ సీఐ వెంకటేశం మునిపల్లి పోలీసు స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు 20వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో మునిపల్లి ఎస్ఐ ఏం.రాజేశ్ నాయక్, తన సిబ్బంది, సీసీయస్ సిబ్బందితో కలిసి మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో తనిఖీ నిర్వహిస్తుండగా బీదర్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న కారుని ఆపి తనిఖీ చేయడం జరిగిందన్నారు.

ముగ్గురు వ్యక్తుల పేర్లు మహమ్మద్ హాజీ, మహాబూబ్ నగర్ టౌన్, మహమ్మద్ మెహరాజ్ అహ్మద్ అలియాస్ ఇమ్రోసు, ఇల్లియాజ్ ఖాన్ లుగా గుర్తించడం జరిగిందన్నారు. అయితే బీదర్ కు కి చెందిన రేళ్మా బేగమ్, జాఫర్ అలీ అను వ్యక్తులు నిందితులకు సరఫరా చేశారని తెలిపారు. కాగా గంజా సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో మునిపల్లి ఎస్ఐ ఏం.రాజేశ్ నాయక్, పోలీసు సిబ్బంధి హెడ్ కానిస్టేబుల్ ఎన్. సుందర్ రాజ్, మహమ్మద్ హనీఫ్, పి.గణపతి రావు, బి.పాండు పాల్గొన్నారు.


Similar News