రైతుల సంక్షేమమే.. ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

రైతుల సంక్షేమమే.. ప్రభుత్వ లక్ష్యమని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు.

Update: 2023-06-03 15:46 GMT

దిశ, అందోల్ : రైతుల సంక్షేమమే.. ప్రభుత్వ లక్ష్యమని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. శనివారం రైతు దినోత్సవం సందర్భంగా అందోలు మండలం అక్సాన్‌పల్లిలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకం ద్వారా ఏడాదిలో రెండు విడతలుగా ఎకరానికి రూ.10 వేలను అందిస్తుందన్నారని తెలిపారు.

కుటుంబంలో రైతు చనిపోతే రైతుబీమా పేరిట ఆ కుటుంబానికి రూ.5 లక్షలను అందజేసి, వారిని ప్రభుత్వం అదుకుంటుందన్నారు. గత ప్రభుత్వాలు రైతులు ఏనాడు పట్టించుకొలేదన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం రైతు దినోత్సవం సందర్బంగా వట్‌పల్లిలో నిర్వహించిన ఎడ్లబండ్ల ఊరేగింపులో బండిపై ఎక్కి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సందడి చేశారు.

అదే విధంగా అందోలు మండలంలోని సంగుపేట, అక్సాన్‌పల్లి, డాకూర్, చింతకుంట గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మన్‌ పి.జైపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జి.మల్లయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లింగాగౌడ్, తహసీల్దారు వెంకటేశ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వర్కల అశోక్, స్పెషల్‌ అఫీసర్‌ లక్ష్మి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పి.నారాయణ, వ్యవసాయ శాఖ ఏవో విజయరత్న, మాజీ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పి.జైపాల్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ శంకరయ్యతో పాటు తదిరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News