అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు

అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-03-12 11:56 GMT

దిశ, నర్సాపూర్: అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ… నర్సాపూర్, మెదక్ రూట్‌లో 731 సర్వే నంబర్లు రోడ్డు పక్క ఉన్న అసైన్డ్ భూముల్లో వాణిజ్య పరమైన నిర్మాణాలు చేపట్టిన 14 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ఎవరైనా అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపడితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుని జీవించాలి తప్ప నిర్మాణాలు చేపట్టరాదని అన్నారు.


Similar News