పెద్దమ్మగూడ గ్రామంలో వింత సంఘటన..

జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడ గ్రామంలోని వెంకటేష్ అనే రైతుకు చెందిన గేదె ఆదివారం ఓకే ఈతలో రెండు దూడలకు జన్మ ఇచ్చిందని మండల పశు వైద్యాధికారి విశ్వ చైతన్య తెలిపారు.

Update: 2024-09-08 13:18 GMT

దిశ, జిన్నారం : జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడ గ్రామంలోని వెంకటేష్ అనే రైతుకు చెందిన గేదె ఆదివారం ఓకే ఈతలో రెండు దూడలకు జన్మ ఇచ్చిందని మండల పశు వైద్యాధికారి విశ్వ చైతన్య తెలిపారు. గేదె దూడలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని ఇందులో ఒకటి మగ, మరొకటి ఆడదూడలు ఉన్నాయన్నారు. వందలో ఒకటిగా ఓకే ఈతలో కవల దూడలు పుట్టడం జరుగుతుందని ఇది అరుదైన విషయంగా పశు వైద్యులు తెలిపారు. కాగా రైతు వెంకటేష్ గేదెకు కవల దూడలు పుట్టడం పై సంతోషం వ్యక్తం చేశారు.


Similar News