జిల్లాలో ఆరు చోట్ల షీ టీం కంప్లైంట్ బాక్సులు..

మహిళల రక్షణకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో షీ టీం కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు.

Update: 2024-09-08 15:35 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మహిళల రక్షణకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో షీ టీం కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. మహిళలను ఎవరైనా అవహేళన చేసిన ఇబ్బందులకు గురిచేసిన కంప్లైంట్ బాక్స్ లో ఒక చిట్టి రాసి వేయాలని సూచించారు. కంప్లైంట్ బాక్స్ లోని ఫిర్యాదుల ఆధారంగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కూడా మగవారి మైండ్ సెట్ లో మార్పు రాకపోతే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ చిట్టి రాసి వేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. షీ టీం కంప్లైంట్ బాక్సులు హుస్నాబాద్ పట్టణంలోని మైనార్టీ స్కూల్, బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హైస్కూల్, సిద్దిపేట న్యూ బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, గజ్వేల్ అర్బన్ పార్కు ల వద్ద షీ టీమ్ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


Similar News