ఇళ్ళ మంజూరుకు డబ్బులు అడుగుతున్న సర్పంచ్, తహసీల్దార్..

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరుకు సర్పంచ్, తహసీల్దార్ లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ లబ్దిదారులు ఆర్డీవో కార్యాలయం ముందు గురువారం ఆందోళన నిర్వహించారు.

Update: 2023-06-15 15:43 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంజూరుకు సర్పంచ్, తహసీల్దార్ లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ లబ్దిదారులు ఆర్డీవో కార్యాలయం ముందు గురువారం ఆందోళన నిర్వహించారు. పాపన్న పేట మండలం బాచారంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ 48 ఇల్లు నిర్మించింది. అయితే అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు ఇస్తున్నారని ఆరోపించారు.

గతంలో సర్వే చేస్తే రూ 20 వేలు ఇచ్చామని, మారో 15 వేలు ఇవ్వాలని సర్పంచ్, తహసీల్దార్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికి ఇల్లు ఇస్తున్నారని అన్నారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని లబ్దిదారులు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మల్లేశం, రాములు, జోగమ్మ, శివరాజ్, లక్ష్మయ్య, కృష్ణ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News