చదువే మహిళలకు ఆత్మస్థైర్యం.. ప్రఖ్యాత చిత్రకారుడు రుస్తుం

Update: 2022-03-07 08:45 GMT
చదువే మహిళలకు ఆత్మస్థైర్యం..  ప్రఖ్యాత చిత్రకారుడు రుస్తుం
  • whatsapp icon

దిశ, సిద్దిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 మార్చ్ ను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో 'మహిళా శక్తి ఐక్యత ' వర్ధిల్లాలి చిత్రాలను అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా బాలికలను, ఆడపడుచులను, మహిళలను మొత్తం స్త్రీ జాతిని అణచివేతకు గురిచేస్తూ, సమాజంలో అత్యాచారం అసమానతలు నిరక్షరాస్యత ప్రభలడానికి నిర్దాక్షిణ్యంగా ఆడపడుచులను చదువుకు దూరంగుచడమే ప్రధానకారణం ప్రమాదకరం అన్నారు.

ఎక్కడ  మహిళలు చదువు కుంటారో అక్కడ ఐక్యత అభివృద్ధి చెందుతుందని,శాంతి' సౌభాతృత్వాలు వెల్లివిరుస్తాయన్నారు.మహిళలు బాగచదివి అన్ని రంగాల్లో దూసుకపోవాలని దూరాచారాలను ఎండగట్టాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా ఆత్మవిశ్వాసంతో సమాజ కల్మషాలను కడిగేయాలని, వివక్షతను నిలదీసి ప్రశ్నించే దైర్యాన్ని కల్గించే చదువే అన్నీసమస్యలకు పరిష్కారం చూపుతాయని, ఐకమత్యాన్ని పెంపొందించుతాయని, మానవతా చిత్రకారుడు రుస్తుం తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్యచిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, ఉపాధ్యాయులు రిజ్వానాబేగం, ఆయేషా, రహీం ఎండి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News