ఆవాలతో అద్భుత కళాఖండం..

గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సోమవారం నాడు ప్రజాకవి, పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాన్ని అవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు.

Update: 2024-09-09 13:42 GMT

దిశ గజ్వేల్ / కొండపాక : గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సోమవారం నాడు ప్రజాకవి, పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాన్ని అవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అన్నారు. అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చిక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అన్నారు.


Similar News