మత సామరస్యానికి ప్రతీక రంజాన్

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు

Update: 2025-03-28 15:49 GMT
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి : మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో తహసిల్దార్ దేవదాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకూ హాజరైన టిజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మతాలకు అతీతంగా సోదర భావంతో చేసుకునే పెద్ద పండుగ అన్నారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్ డీ ఓ రవీంద్రారెడ్డి, తాసిల్దార్ దేవదాస్, కాంగ్రెస్ నాయకులు తోపాటు అనంత కిషన్, కూన సంతోష్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News