స్వయం ఉపాధికి రాజీవ్ యువ వికాసం

సంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ),

Update: 2025-03-25 11:41 GMT

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ), ఆర్దికంగా బలహీనవర్గాల ( ఈడబ్యూఎస్) కు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేస్తుందనిసంక్షేమ అధికారి జగదీష్ అన్నారు. ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అర్హులైన వ్యక్తులు ఆర్థిక సహాయం కోరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు http://tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తేది: 05-04-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ. జగదీష్ గారు తెలిపారు.

Similar News