రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ పోరాటంలో పాల్గొన లేదు : హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ పోరాటంలో లేని ముఖ్యమంత్రి
దిశ, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ పోరాటంలో లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్రం మేమే ఏర్పాటు చేశామంటూ వేదాలు వల్లిస్తున్నాడని, తెలంగాణ ఏర్పాటుకు ఎక్కడ సహకరించని రేవంత్ తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను ప్రణంగా పెట్టి ఆమరణ దీక్ష చేయడం, ప్రజల ఆకాంక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ లేదని, ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు పెట్టింది లేదు, ఉద్యమంలో ఏనాడూ పాల్గొన్న వ్యక్తి కాదు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితం ఎవరో దయ వల్ల తెలంగాణ వచ్చింది అనడం ఉద్యమ కారులను, తెలంగాణ వారిని అవమానించడమే అన్నారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డు పడ్డది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ది ద్రోహాల చరిత్ర ఆనాడు ఆంధ్ర లాబియింగ్ కు తలొగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కింది నెహ్రూ అని, 1969 ఉద్యమాన్ని ఇనుప కాళ్లతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం అని ఆరోపించారు.
కాంగ్రెస్ పొట్టన బెట్టుకున్న అమరులకు నిదర్వనం అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ, అమాయకులను బలి తీసుకున్నది, తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో కలుపుకొని ప్రజల ఆకాంక్షను కాలరాశారన్నారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకుంటే, పోరాటం చేయకుంటే అసలు తెలంగాణ మాటే లేదు, అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించారు నాటి పాలకులు తెలంగాణ బదులు వెనుకబడ్డ ప్రాంతం అనాలని హుకుం జారీ చేశారన్నారు. 66 ఏండ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో జై తెలంగాణ అంటే పాపం, అలాంటి సమయంలో కేసీఆర్ పార్టీ పెట్టారు, ఉద్యమాన్ని ముందుండి నడిపించారని, 2004లో హామి ఇస్తే కేంద్ర క్యాబినెట్ లో చేరారని వివరించారు. కేంద్రంలో మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్ యూ ఆఫీసు దాకా తిరిగిండు,దేశంలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ ఇచ్చింది కేసీఆర్..ఇది చరిత్రలో ఉన్న వాస్తవం అన్నారు.
తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ సమయంలో ఇక్కడ వైయస్ తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా, బీడా అన్నారు. హైదరాబాద్ పోవాలంటే పాస్ పోర్టు వీసా కావాలె అన్నరు. అయినా కేసీఆర్ గారు తెలంగాణ కోసం నిరంతరం శ్రమించారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదని, చివరకు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామ చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ఇ చ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే అంతమంది చనిపోయేవారా, అయితే నా శవ యాత్ర, లేదంటే జైత్ర యాత్ర అని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ ఉద్యమానికి కూర్చొంటే ఖమ్మం తరలించారన్నారు. ఖమ్మం జైల్లో పెట్టి ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ గారి పోరాట ఫలితం కాదా? చిదంబరం జయశంకర్ సార్ కు ఫోన్ చేసారని, జయశంకర్, కేసీఆర్ రాసి ఇచ్చిందే చిదంబరం చదివారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రకటించారు. నవంబర్ 29 లేకుంటే, డిసెంబర్ 9 లేదు, ఇవి లేకుంటే జూన్ 2 తెలంగాణ ఏర్పాటు లేదన్నారు. రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది, వంట వార్పులో, రైల్ రోకోలో, మిలియన్ మార్చులో, సకల జనుల సమ్మెలో, సాగర హారంలో రేవంత్ రెడ్డి లేడన్నారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఉద్యమం గురించి నీ ద్రోహ చరిత్ర, రెండు కళ్ల సిద్ధాంతం సేవలో ఉన్నవు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మా మీద 350 కేసులు ఉండే ఆరోజు. అరెస్టు అయి జైళ్లలో ఉన్నాం. రేవంత్ రెడ్డి మీద ఒక్క కేసు అయినా ఉన్నదా నాడు సోనియా బలి దేవత అన్నడు, నేడు దేవత అంటున్నడని విమర్శించారు. నాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశాడు, వెన్నుపోటు పొడిచాడని, వక్రీకరించిన మాత్రాన తెలంగాణ చరిత్ర చెరిగిపోదని, కేసీఆర్ కీర్తి ఎన్నటికీ పోదని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా పెట్టలేదని రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు. అవగాహనరాహిత్యం అన్నారు.
మార్పు విగ్రహాలను మార్చడంలో కాదు..ప్రజల జీవితాల్లో ఉండాలి..
తెలంగాణ లో మార్పు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చడంలో కాదని, ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే మార్పు అవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగానే తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసిందని, రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో విగ్రహాలు ఉన్నాయన్నారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయలేదని అబద్దాలను మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్ లేదు, దళిత బందు, బీసీ బందు అన్ని బందు చేశారని ఆరోపించారు. అదే విధంగా గురుకుల పాఠశాలల్లో చదివి విద్యార్థులకు ఆహారం సరిగా అందించకపోవడం వల్ల 45 మంది పిల్లలు చనిపోయారని విమర్శించారు. మార్పు అనేది ప్రజల జీవితాల్లో వెలుగులు పంచాలి తప్ప ..అన్ని బంద్ పెట్టడం కాదన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, శ్రీధర్ రెడ్డి, కసిని శ్రీకాంత్, కౌన్సిలర్ శ్రీకాంత్, శ్రావణ్ రెడ్డి, అజ్జు, మందుల వరలక్ష్మీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.