గురుకుల విద్యార్థి సాయి ప్రకాష్ అదృశ్యం…15 రోజులైనా దొరకని ఆచూకీ
నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులోని గిరిజన అక్రమ పాఠశాల నుంచి విద్యార్థి గత నెల నవంబర్ 29 సాయంత్రం అదృశ్యమయ్యాడు
దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులోని గిరిజన అక్రమ పాఠశాల నుంచి విద్యార్థి గత నెల నవంబర్ 29 సాయంత్రం అదృశ్యమయ్యాడు. 15 రోజులైనా కొడుకు దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉంది.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన గొల్ల సాయి ప్రకాష్ (13) గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్నారు. గత నెల శుక్రవారం బిస్కెట్లు తీసుకొని వస్తానని తోటి విద్యార్థులకు చెప్పి పాఠశాల నుంచి బయలుదేరారు. తల్లిదండ్రులు గొల్ల కృష్ణయ్య, తల్లి చంద్రకళ కుమారుని కోసం చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికిన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గాని ఒక్క కొడుకు లేకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. హైదరాబాదులో మియాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కోఠి , తో పాటు వివిధ ప్రాంతాల్లో వెతికిన కనిపించడం లేదన్నారు. కర్ణాటక బీదర్, ఔరద్ సైతం వెతికిన ఆచూకీ కనబడలేదన్నారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వగా గురుకుల అశ్రమ పాఠశాల ప్రత్యేక అధికారి బాలామణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.