Narayankhed MLA : దళారులను నమ్మవద్దు.. రైతులకు సహకరించాలి

రుణమాఫీ లో దళారులను ప్రోత్సహించ వద్దని, రైతులకు

Update: 2024-08-27 14:48 GMT

దిశ, నారాయణఖేడ్: రుణమాఫీ లో దళారులను ప్రోత్సహించ వద్దని, రైతులకు అనుకూలంగా సహకరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.. రైతులు దళారులను నమ్మి మోసపోతున్నారని, రైతు నేరుగా వచ్చి తన రుణమాఫీ చేసుకునే విధంగా చూసుకోవాలని ఎమ్మెల్యే బ్యాంకర్లకు సూచించారు. ఏపీజీబీ బ్యాంకుల్లో సరిగా రుణమాఫీ జరగడం లేదని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, నేరుగా బ్యాంకు కలవాలని తెలిపారు. బ్యాంక్ అధికారులు ఒకవేళ మీకు ఇబ్బందులు పెడితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక్కొక్కరి వద్ద 30 నుంచి 40 వేల రూపాయలు బ్యాంకులో ఉంచుకుని మిగతా డబ్బులు ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పింఛన్లు, రైతుబంధు, బ్యాంకులో వచ్చిన డబ్బులని రాకుంట చేస్తున్నారని అన్నారు. ఎస్బీఐ బ్యాంకు అధికారులు పూర్తిగా అనుకూలంగా సహకరించాలన్నారు.

రుణమాఫీ ఇప్పటివరకు 50 శాతం జరిగిందని, మిగతాది కూడా త్వరలోనే రుణమాఫీకి స్టాపు పూర్తిగా లేరని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని ఆ వ్యక్తి వల్లనే ఊరు గ్రామాన్ని బ్యాంకులో సహకరిస్తున్నారని, నేరుగా రైతులను రానివ్వడం లేదని, ఒక్కొక్క రైతు రుణమాఫీ చేయాలని తెలిపారు. ఎకరాకు వెయ్యి చొప్పున వసూలు చేస్తారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రెండు లక్షల రుణమాఫీ బ్యాంక్ అధికారులు పూర్తి చేయాలని అన్నారు. పూర్తిగా బ్యాంకుల సరిగా స్టాప్ లేనందుని లేటుగా జరుగుతుందని బ్యాంక్ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. లక్ష ఇరవై ఐదు వేలు ఉంటే లక్షనే ఇస్తున్నారని అలా కాకుండా మొత్తం ఇవ్వాలన్నారు. సొసైటీలో కూడా ఇప్పటివరకు రుణమాఫీ రాలేదని, అవి కూడా పూర్తి చేయాలన్నారు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వలనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంక్ అంటే అందరికీ సమానంగా ఉండాలని, ప్రతి ఒక్కరు బ్యాంకుకు వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతి రైతుకు పూర్తిగా సహకరించాలని, ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రమణారెడ్డి, డీడీ ఎం కృష్ణ తేజ, డీసీసీబీ డీజీఎం జి శ్రీనివాస్, నారాయణఖేడ్ డివిజన్ బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.


Similar News