వాహనదారులు నిబంధనలు పాటించాలి: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

వాహనదారులు ఆర్టీవో నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ శ్వేత ప్రకటనలో హెచ్చరించారు.

Update: 2023-04-22 17:03 GMT
వాహనదారులు నిబంధనలు పాటించాలి: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
  • whatsapp icon

దిశ, సిద్దిపేట ప్రతినిధి: వాహనదారులు ఆర్టీవో నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ శ్వేత ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల పట్టణాలలో కొంతమంది వాహనదారుడు వారి వాహనాలకు ఆర్టీవో నిర్దేశించిన నెంబర్ ప్లేట్ కాకుండా ఎగుడుదిగుడు నెంబర్ ప్లేట్లు, నెంబర్ ప్లేట్లు మార్ఫింగ్ చేయడం, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

సదరు వాహనాలపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో రెండు, మూడు రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడవాలని, ఆర్టీవో సూచించిన విధంగా నెంబర్ ప్లేట్ అమర్చుకోవాలని సూచించారు.

Tags:    

Similar News