Medak SP : డయల్ 100 సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలి

మెదక్ జిల్లా సాయుధ దళ డీఎస్పీ రంగ నాయక్, ఆర్ ఐ

Update: 2024-08-28 10:29 GMT

దిశ, మెదక్ టౌన్ : మెదక్ జిల్లా సాయుధ దళ డీఎస్పీ రంగ నాయక్, ఆర్.ఐ శైలేందర్ మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్స్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాల పనితీరు, వాటి కండిషన్ లను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డయల్ 100 కాల్ గాని ప్రజల వద్ద నుండి ఏదైనా అత్యవసర ఫోన్ కాల్ వచ్చినప్పుడు పోలీస్ పెట్రోల్ కార్ డ్రైవర్లు అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించే కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని అన్నారు. డయల్ 100 సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి, వాహనాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

జిల్లా పరిధిలోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఇన్నోవా కార్లు డ్రైవింగ్ విధానం కొత్త సిస్టం ప్రకారం నడుచుకోవలెనని, వాహనం యొక్క నిర్వహణ విధానం గురించి, ఎయిర్ బ్యాగ్స్ గురించి, బ్యాటరీ, కూలెంట్ ఆయిల్, టైర్ల లలో నింపవలసిన గాలి, నూతన వాహనాలకు ఉన్న అధునాతన సదుపాయాలు, ఏ సి నిర్వహణ సిబ్బందికి తెలపడం జరిగిందని అన్నారు. వాహనాల ఇంజన్ల పనితీరును, ఏదైనా సమస్య వస్తే వెంటనే తీసుకోవాల్సిన చర్యలను గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలిసి ఉండాలి అన్నారు. పోలీస్ వాహనాల డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, వాహనం యొక్క మెకానిజం గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్, సాయుధ దళ డీఎస్పీ రంగ నాయక్, ఆర్.ఐ. శైలేందర్, ఆర్. ఎస్. ఐ మహిపాల్ తో పాటు యం.టి సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News