లొట్టపీసు కేసు విచారణకు ఎందుకు భయం కేటీఆర్.. ఎంపీ రఘునందన్ రావు

కోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టేసేసరికి కేటీఆర్ కి సలి జ్వరం పట్టుకుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2025-01-07 08:16 GMT

దిశ, తూప్రాన్ : కోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టేసేసరికి కేటీఆర్ కి సలి జ్వరం పట్టుకుందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 108 అంబులెన్సును ప్రారంభించి ఆస్పత్రిని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి డాక్టర్లను కలిసి ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కి పోలీసుల దగ్గర వెళ్లడానికి సలి జ్వరం వస్తుందా అన్నారు. న్యాయవాదులను తీసుకొని దొంగలు ఎక్కడైనా పోలీస్ స్టేషన్కు వెళ్తారా వాళ్ళు రాణిస్తారా.. పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కి అప్పుడు తెలంగాణలో పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్న నువ్వు ఈ రోజు పోలీసులను ఏరకంగా తప్పుపడుతున్నావ్ అని నిలదీశారు.

మొదటగా లొట్ట పీసు కేసుకి ఎవరు భయపడతారని దర్జాగా మాట్లాడిన కేటీఆర్ కు ఇప్పుడు విచారణకు రమ్మంటే న్యాయవాదుల అవసరం వచ్చిందని ఎద్దేవా చేశారు. న్యాయం చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటాయని కోర్టులకి పోలీసులకి సహకరించి తప్పు ఒప్పులను న్యాయం నిర్ణయిస్తుందని ప్రతిపక్షమైన అధికారపక్షమైన కోర్టు తీర్పు కట్టుబడి ఉండాలని అన్నారు. అధికారపక్షంలో ఉన్నప్పుడు మీరు హింసించినప్పుడు గుర్తు లేదా ఈ చట్టాలు, పోలీసుల ప్రవర్తన గురించి ప్రపంచ స్థాయిలో సోషల్ మీడియాలో మూడు కోట్లు ఖర్చుపెట్టి కేటీఆర్కేదో అన్యాయం జరిగింది, ఏదో చేస్తుర్రు అన్న ప్రచారం చేపిస్తున్నావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు కలకల్ సర్పంచ్ నత్తి మల్లేష్, వెంకటేష్, పురం రవి, అజయ్ కుమార్, నర్సింలు, సత్యనారాయణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News