మల్లన్న ఆలయ పాలకమండలి నియామకం… జీవో జారీ

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పాలకమండలి లో ఎనిమిది మంది సభ్యులను చేర్చుతూ జీవో జారీ చేశారు

Update: 2024-12-04 10:01 GMT

దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పాలకమండలి లో ఎనిమిది మంది సభ్యులను చేర్చుతూ జీవో జారీ చేశారు. జీవో ఆర్ టీ నెం 463 ప్రకారం ఎనిమిది మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ గా అర్చకుడిని చేర్చారు. రెగ్యులర్ కమిటీ లో 14 మంది సభ్యులతో ఏర్పాటు చేయాల్సిన పాలకమండలిని కేవలం తొమ్మిది మంది సభ్యులు చిగిరి కొమురయ్య, కాయిత మోహన్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, వల్లద్రి అంజిరెడ్డి, మామిడాల లక్ష్మి, నేరెళ్లపల్లి మహేందర్ రెడ్డి, కొప్పురపు జయప్రకాశ్ రెడ్డి తో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం జీవోను విడుదల చేశారు. 80 మంది దరఖాస్తు దారులలో నేర చరిత్ర కలిగిన వారిని కొంతమందిని మినహాయిస్తే, అందులోంచి కేవలం ఎనిమిది మందినే నియమించడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా మరో ఆరుగురికి ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.

ఆరుగురు సభ్యుల కోసం 20 రోజుల గడువుతో మరో నోటిఫికేషన్

రెగ్యులర్ కమిటీలో 14 మంది సభ్యులు కొనసాగనున్న నేపథ్యంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించేదుకు తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసి,20 రోజుల గడువు ఇచ్చారు. అందులోంచి ఆరుగురికి చోటు కల్పించి మొత్తం 14 మంది సభ్యులతో మల్లన్న ఆలయ పాలకమండలిని ఏర్పాటు చేయన్నున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జీవో ఆర్ టీ నెం 464 నోటిఫికేషన్ ప్రకారం మల్లన్న ఆలయ కమిటీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డిసెంబర్ 29 మల్లన్న కళ్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా మల్లన్న కళ్యాణం లోపే 14 మంది సభ్యులతో నూతన పాలకమండలి కొలువుదీరానుంది.


Similar News