కేసీఆర్ స్ఫూర్తి తో సినిమా తీసిన రాకింగ్‌రాకేశ్‌ ని ఆదరించండి : ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాకింగ్‌రాకేశ్‌ తీసిన సినిమా చరిత్రలో నిలిచిపోతుందని సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.

Update: 2024-12-04 13:48 GMT

దిశ, రామచంద్రపురం: బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాకింగ్‌రాకేశ్‌ తీసిన సినిమా చరిత్రలో నిలిచిపోతుందని సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. బుధవారం నాడు రామచంద్రపురం పట్టణం లోని సంగీత సినిమా థియేటర్‌లో ‘కేసీఆర్‌’ చిత్రాన్ని స్థానిక నాయకులు ఆదర్శ్ రెడ్డి తన సొంత ఖర్చులతో ప్రదర్శిస్తున్న షోను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే ఒక చరిత్ర రాష్ట్రం సాధించడమే కాదు, రాష్ట్రాన్ని పదేళ్ళు అద్భుతమైన ప్రగతి పథంలో నడిపిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ స్ఫూర్తి తో తీసిన సినిమా ను ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, గుమ్మడిదల బీఆర్‌ఎస్‌ నాయకులు గోవర్దన్ రెడ్డి, నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News