అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: పుష్పలత

తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని....Kanti Velugu at Boppapur

Update: 2023-02-10 07:29 GMT
అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: పుష్పలత
  • whatsapp icon

దిశ, అక్బర్ పేట భూంపల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో సర్పంచ్ బండమీది బాలమణి మల్లయ్యతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటికి సంబంధించిన ఎలాంటి మందులైనా, అవసరమైన ఆపరేషన్ లు ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని సూచించారు. మానవ శరీరంలో కళ్ళు చాలా సురక్షితమైనవని, వాటిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల జ్యోతి కృష్ణ, నాయకులు రామా గౌడ్, డాక్టర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, బొప్పాపూర్ బీఆర్ఎస్ నాయకులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News