ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట

ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు.

Update: 2024-03-12 12:30 GMT

దిశ, నారాయణఖేడ్: ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మండలంలో జూకల్, అనంతసాగర్, సత్యగామా, అంత్వర్, జగనాథ్ పూర్ ఒక్కొక్క గ్రామానికి రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూన్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అదనంగా ఇవ్వని అడిగిన వెంటనే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ . 20 కోట్లు, నియోజకవర్గ గ్రామాల అభివృద్ధి కోసం రూ .10 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంచడం జరిగిందన్నారు. అలాగే గృహ జ్యోతి పథకం కింద రెండు వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ అశోక్ రెడ్డి, ఎంపీపీ తనయుడు కర్ర రమేష్ చౌహాన్ , పీఎసీఎస్ మాజీ చైర్మన్ శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ సంగన్న, ముదిరాజ్ శంకర్, పండ రెడ్డి, ప్రసన్న కుమార్ , లింగాపూర్ వినోద్ పటేల్, ఈదులపల్లి మల్లన్న పంతులు, ఇందూరు మల్లప్ప, కోటప్పల రవి పటేల్, ఉజా లంపాడు మల్లప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


Similar News