సమస్యలు తెలుసుకోవడానికే ఎమ్మెల్యే గా ఉన్నా : ఎమ్మెల్యే పల్లా
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే ఎమ్మెల్యే గా ఉన్నానని, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు
దిశ, చేర్యాల: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే ఎమ్మెల్యే గా ఉన్నానని, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో చేర్యాల, కొమురవెల్లి మండలాల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత సంవత్సర కాలంగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ దాదాపుగా వెయ్యికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద ప్రజలకు అందించానని అన్నారు. చేర్యాల ప్రభుత్వ హాస్పిటల్ విస్తరణ గురించి అసెంబ్లీలో ప్రస్తావించానని, అరోగ్య శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చానని అన్నారు.
చెరువుల మరమ్మతులకు, భూసేకరణకు సుమారు రూ.170 కోట్లు అవసరమని, వాటిని మంజూరు చేసి మొదటగా చేర్యాల ప్రాంత రిజర్వాయర్లు నీటితో నింపాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూప రాణి - శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కర్నాకర్, బిఆర్ఎస్ చేర్యాల పట్టణ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, శివగారి అంజయ్య, జింకల పర్వతాలు, పచ్చిమడ్ల సిద్దిరాములు గౌడ్, మానస, తాడేం రంజిత తదితరులు పాల్గొన్నారు.