కల్లు తాగించి బంగారం, వెండి కాజేసిన భార్యాభర్తలు అరెస్ట్

వృద్ధురాలికి కల్లు తాగించి బంగారం, వెండి నగలను కాజేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Update: 2024-12-04 12:24 GMT

దిశ, నిజాంపేట: వృద్ధురాలికి కల్లు తాగించి బంగారం, వెండి నగలను కాజేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరాజా గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.. గత నెల 30 వ తేదీన చెల్లాపూర్ గ్రామానికి చెందిన బండ నరసవ్వ అనే వృద్ధురాలిని మాయ మాటలు చెప్పిమద్యం తాగించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లిన కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లిన ఖాజాపూర్ గ్రామానికి చెందిన ధరవత్ శీను, భార్య ధరావత్ భూలి లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుండి ఒక జత కమ్మలు, రూ. 30 వేల నగదు తాకట్టు పెట్టిన బంగారు గుండు, వెండి కడియాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకట్రాజ గౌడ్ తెలిపారు. దొంగలను పట్టుకునే విషయంలో పోలీస్ వారికి సహకరించిన ఆటోడ్రైవర్ మక్కల మహిపాల్ ను సీఐ అభినందించి నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ సందర్భంగా అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.


Similar News