పరీక్ష రాస్తుండగా గుండె నొప్పి..తక్షణమే స్పందించిన ఎస్సై

గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థికి గుండెపోటు వచ్చిన సంఘటన పటాన్ చెరు డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది

Update: 2024-12-16 15:23 GMT

దిశ,పటాన్ చెరు : గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థికి గుండెపోటు వచ్చిన సంఘటన పటాన్ చెరు డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీ నగర్ గ్రామానికి చెందిన నగేష్ గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు సోమవారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. పరీక్షకు హాజరై నాలుగో పేపర్ రాసే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే గమనించిన పరీక్ష సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ ఆసిఫ్ అలీ తక్షణమే స్పందించి.. మూడవ అంతస్తు నుంచి నగేష్ ను తన భుజంపై మోసుకొని వచ్చి.. పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ప్రథమ చికిత్స అనంతరం.. సంగారెడ్డి లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించి.. సకాలంలో వైద్యం అందించేలా కృషి చేసిన ఎస్ఐ ఆసిఫ్ అలీ ని ప్రతి ఒక్కరూ అభినందించారు.


Similar News