తపాస్ పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు
కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ లోకి గోదావరి
దిశ,కొమురవెల్లి : కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు విడుదల కావడం తో మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంగళవారం గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉండాలని చేర్యాల,కొమురవెల్లి మండలాల రైతాంగానికి సాగునీటిని అందించే సదుద్దేశంతో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయించడం జరిగిందని, గతంలో ఈ రిజర్వాయర్ ను స్వయంగా తానే ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ ప్రాంతానికి రిజర్వాయర్లు మంజూరు చేయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరిందని, గత పది సంవత్సరాలలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మన నీటిని సిద్దిపేట ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం కూడా జరిగిందన్నారు.
అదే విధంగా సాంకేతిక కారణాలతో పంట రుణమాఫీ కానీ రైతులకు కూడా అధికారులు పరిశీలించి వాటిని కూడా రుణమాఫీ చేస్తున్నారని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహాదేవని శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ మెర్గు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సనాది భాస్కర్, ఐనాపూర్ తాజా మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లం బాలయ్య,మోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కాయిత శ్రీనాథ్ రెడ్డి, వల్లద్రి అంజిరెడ్డి, మెరుగు శ్రీనివాస్, జంగని రవి, కంకణాల ప్రవీణ్, పంజాల మల్లేశం, ముత్యం అంజయ్య, చింతల రమేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు రేష్మ, ఏర్పుల రాజు, ఉప్పల వంశీకృష్ణ, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.