రూ.1.60 లక్షల గోవా మద్యం పట్టివేత

అక్రమంగా గోవా నుంచి హైదరాబాద్ కు కారులో 64 మద్యం బాటిళ్లును తరలిస్తుండగా జహీరాబాద్ డీటీఎఫ్ టీం సభ్యులు,

Update: 2024-12-30 15:55 GMT

దిశ, జహీరాబాద్: అక్రమంగా గోవా నుంచి హైదరాబాద్ కు కారులో 64 మద్యం బాటిళ్లును తరలిస్తుండగా జహీరాబాద్ డీటీఎఫ్ టీం సభ్యులు, ఇతర ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.1.60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మద్యంతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోచోట 34 బాటిళ్ళు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి బాటిళ్లు అక్కడ పడేసి వదిలి పారిపోయాడని డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్ పేర్కొన్నారు. సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ.శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు.


Similar News