సైన్స్ ల్యాబ్‌కు నిధులు మంజూరు
సిద్దిపేట నియోజకవర్గంలోని 8 ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం రూ.1. 8 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలిపారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట నియోజకవర్గంలోని 8 ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం రూ.1. 8 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం పరిధిలోని పుల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, చిన్నకోడూర్ మండలం విఠలాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, మాచాపూర్, రాముని పట్ల గ్రామాల్లో, నంగునూర్ మండలం పరిధిలోని ఆంక్షపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, నారాయణ రావు పేట మండల పరిధిలోని గుర్రాల గొంది గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్, నాసర్ పురా ఉర్దూ మీడియం, ప్రభుత్వ న్యూ హై స్కూల్లకు సైన్స్ ల్యాబ్ లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఒక్కో సైన్స్ ల్యాబ్ రూ. 13 లక్షల రూ. 50 వేలుతో నిర్మించనున్నట్లు వెల్లడించారు.