నది పరివాహక ప్రాంతాల్లో వెళ్లకూడదు.. ఏఎస్సై

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు వంపులు చెరువు, కుంటలు, పొంగి పొర్లి మత్తడి దుంకుతున్నాయి.

Update: 2024-09-08 15:26 GMT

దిశ, చిలిపిచెడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు వంపులు చెరువు, కుంటలు, పొంగి పొర్లి మత్తడి దుంకుతున్నాయి. మెదక్ జిల్లాలోని అత్తి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన చాముండేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న నది పరివాహక ప్రాంతాల్లో ఎవరు వెళ్లకూడదని చిలిపిచేడ్ ఏఎస్సై మిస్బోద్దిన్ సూచించారు.

నది నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఆ వైపు వెళ్లకూడదని, అలాగే చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని ఆయన సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులు సైతం సరదా కోసం వెళ్తుంటారు. దీన్ని గ్రహించిన పోలీసులు ఆ వైపు వెళ్లకుండా నది వైపు వెళ్లే రహదారి పై ముల్లకంచెను అడ్డుగా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సత్యం, సతీష్ కుమార్ వున్నారు.


Similar News