అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డా.శరత్

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Update: 2023-03-15 13:44 GMT

దిశ, సంగారెడ్డి: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో పంచాయతీ రాజ్, విద్య, పంచాయితీ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మన ఊరు మనబడి, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్, బీటీ రెన్యువల్స్, సీసీ రోడ్లు, లేబర్ మొబలైజేషన్, ప్రాపర్టీ టాక్స్ వసూలు, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అందుకు ఆయా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఎఫ్టీవోలు జనరేట్ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. మన ఊరు.. మనబడి పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. పెండింగ్ ఎఫ్టీవోలను వెంటనే అప్ లోడ్ చేయాలన్నారు.

స్పెషల్ డెవలప్ మెంట్ (ఎస్డీఎఫ్)తో చేపట్టిన పనుల పురోగతి, బీటీ రెన్యువల్స్ పనులకు సంబంధించి ఆయా అధికారులతో కలెక్టర్ చర్చించారు. 20 లోగా అన్ని పంచాయతీల్లో వంద శాతం పన్ను వసూళ్లు కావాలని స్పష్టం చేశారు. ఆయా విషయాల్లో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్టీవో శ్రీనివాసరావు, డీపీవో సురేష్ మోహన్, డీఈవో నాంపల్లి రాజేష్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ జగదీశ్వర్, తదితర ఇంజనీరింగ్ ఈఈలు, ఏపీడీ జయదేవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News