ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. అక్కడికక్కడే మృతి చెందిన మహిళ

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేందుకు వెళ్లిన కూలీ, మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-06-05 07:55 GMT

దిశ, దౌల్తాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేందుకు వెళ్లిన కూలీ,  మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన పస్సుల అనిత (34) రోజు లాగే గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనిచేస్తుండగానే బురుగులు కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందింది. అనితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దీపిక, దీక్ష, అనాధలయ్యారు. తల్లి ఉదయం పూట జాతీయ ఉపాధి పని చేసుకుంటూ మిగతా సమయంలో కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తూ ఉండేదని గ్రామస్తులు తెలిపారు. కాగా వెంటనే ప్రభుత్వమే ఆదుకోవాలంటూ గ్రామస్థులు కోరారు.


Similar News