ఖాజీపల్లి అభివృద్ధికి సహకరించండి.. ఎంపీకి విన్నవించిన నేతలు..

ఖాజీపల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ దండే రమాకాంత్ మంగళవారం ఎంపీ రఘునందన్ రావును కలిసి విన్నవించారు.

Update: 2025-01-07 08:44 GMT

దిశ, జిన్నారం : ఖాజీపల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ దండే రమాకాంత్ మంగళవారం ఎంపీ రఘునందన్ రావును కలిసి విన్నవించారు. ఆర్కే ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా, అభివృద్ధి కార్యక్రమాలను దండే రమాకాంత్ ఎంపీ రఘునందన్ రావుకు వివరించారు. అనంతరం దండే రమాకాంత్ మాట్లాడుతూ ఖాజీపల్లి గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేలా నిధులు కేటాయించాలని ఎంపీకి విన్నవించామని తెలిపారు.

ముఖ్యంగా కాలుష్య సమస్యతో పాటు గండిగూడెం చెరువుతో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎంపీకి వివరించామని తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు కాలుష్య, రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చినట్లు రమాకాంత్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.


Similar News