రాజ్యాంగ దినోత్సవం అంటే నిర్లక్ష్యం ఎందుకు..?
రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలకు మున్సిపాల్ అధికారులు ఏర్పాట్లు...Congress Leaders protest
దిశ, సిద్దిపేట ప్రతినిధి: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలకు మున్సిపాల్ అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు ఏర్పాటు చేయకపోవడం బాధకరమని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, ఎస్సీ సెల్ చైర్మన్ బొమ్మల యాదగిరిలు అవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూల మాల వేసి ఘన నివాలర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంబేద్కర్ రాజ్యాంగం, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ చొరువ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు జయంతి, వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున పూల మాలలు ఏర్పాటు చేసి విగ్రహాన్ని అందంగా అలంకరిస్తారని, కానీ రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్ విగ్రహం వద్ద అలాంటివి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికీ అంబేద్కర్ ను అవమాన పరిచినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ స్పందించి, ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మీ, మార్క సతీష్ గౌడ్, మజార్ మాలిక్, కలీమొద్దీన్, గ్యాదరి మధు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.