ప్రశాంతత పవిత్ర మనసుతో కలిసిమెలిసి ఉండాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ముస్లింల పవిత్ర రంజాన్ సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోని

దిశ,చేగుంట : ముస్లింల పవిత్ర రంజాన్ సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకున్నారు. గత 30 రోజులుగా ఉపవాస దీక్షలు చేసిన అనంతరం సోమవారం రంజాన్ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈద్గా మైదానంలో జరిగిన రంజాన్ వేడుకలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు రంజాన్ పండుగను జరుపుకుంటాయని పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రశాంతత పవిత్ర మనసుతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు.
మహమ్మద్ ప్రవక్త చెప్పిన మార్గంలో నడవాలని సహనం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వెంట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్తి వెంకటయ్య, మాజీ జెడ్పిటిసి ముదాం శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల శాఖ మాజీ అధ్యక్షుడు మంచి కట్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు రాజిరెడ్డి, మాధవరెడ్డి, ఎర్ర యాదగిరి, క్రాంతి, డిష్ రాజు, లక్ష్మీనారాయణ, నాగరాజు, ముస్లిం మైనార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ నియమతుల్లా, షకీల్ అహ్మద్, రబ్బాని, రహీముద్దీన్ తోపాటు ముస్లిం మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.