మీ ఇంటి ఆడబిడ్డను భారీ మెజార్టీతో గెలిపించండి.. సునీత లక్ష్మారెడ్డి
మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత లక్ష్మారెడ్డి కోరారు.
దిశ, చిలిపిచెడ్ : మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం చిలిపిచేడ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జగంపేట్ గ్రామం నుండి ఇంటింటి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, బీఆర్ఎస్ పార్టీ వచ్చాకే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.
చిలిపిచేడ్ మండల ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకోచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.