సబ్సిడీపై వ్యవసాయ పరికరాలకు దరఖాస్తుల స్వీకరణ
2024-25 వ ఆర్థిక సంవత్సరానికి రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించడానికి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని మండల వ్యవసాయధికారి జావేద్ తెలిపారు

దిశ, రేగోడ్: 2024-25 వ ఆర్థిక సంవత్సరానికి రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించడానికి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని మండల వ్యవసాయధికారి జావేద్ తెలిపారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ ,జనరల్ మహిళలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎస్సీ,ఎస్టీ రైతులకి 50 శాతం రాయితీ, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక లక్ష రూపాయల లోపు అంతకన్నా ఎక్కువ లబ్ది పొందు రైతులు కనీసం ఒక ఎకరం లోపు వరకు భూమి కలిగి ఉండాలని సూచించారు. దరఖాస్తు ఫారమ్ , పట్టాదారు పాసు పుస్తకం , ఆధార్ కార్డు, ట్రాక్టర్ కు సంబంధించిన పరికరాలకి ఆర్ సీ జీరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో , బ్యాంక్ పాస్ బుక్ అవసరం ఉంటాయని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు ఈ నెల 27 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.