సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం
సైబర్ నేరాలు కొత్త తరహా మోసాలకు తెర లేపారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది,

దిశ, సంగారెడ్డి :సైబర్ నేరాలు కొత్త తరహా మోసాలకు తెర లేపారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్లు పన్ను వసులు తో పాటు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన షాపులకు ట్రేడ్ లైసెన్స్ లను రెన్యువల్ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు సదాశివపేట పట్టణంలోని కొందరు దుకాణదారులకు “నేను మున్సిపల్ కమిషనర్ ను మాట్లాడుతున్నాను. మీ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసింది. రెన్యువల్ చేసుకోవాలని నేను పంపించిన ఫోన్ పే గూగుల్ పే నెంబర్లకు అమౌంట్ పంపించాలని” ఆదేశాలు జారీ చేశారు. షాపులకు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని, మిషన్ భగీరథ బిల్లులు చెల్లించాలని ఉదయం నుండి పలువురికి ఫోన్ కాల్స్ చేశారు.
తాము పంపిన నెంబర్లకి గూగుల్ పే, కానీ ఫోన్ పే కానీ చేయాలంటూ సైబర్ నేరగాళ్ల ఆదేశించారు. కాగా సదాశివపేట కమిషనర్ గా మహిళా అధికారి ఉండటంతో అనుమానం చెందిన పలువురు వ్యక్తులు విషయం మున్సిపల్ కమిషనర్ ఉమారాణికి చెప్పడంతో అలెర్ట్ అయిన మున్సిపల్ కమిషనర్ సదాశివపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివపేట పట్టణ ప్రజలు సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఫోన్లకు రెస్పాన్స్ ఇవ్వవద్దని ఫోన్ పే, గూగుల్ పే లకు ఎలాంటి అమౌంట్ పంపించవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.