వీధి కుక్కల కౄరత్వం.. ఆడుకుంటున్న చిన్నారి జుట్టు పట్టి లాక్కెళ్లి..

వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట

Update: 2024-08-26 14:10 GMT

దిశ, మిరుదొడ్డి : వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అన్నేబోయిన దేవేందర్, లాస్య దంపతుల కూతురు అన్షిత (2) ఆరు బయట పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి, జుట్టు పట్టుకొని లాక్కెళ్తుండగా , గమనించిన స్థానికులు వీధి కుక్కలను తరిమి వేశారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన అన్షితను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. చిన్నారి అన్షిత తలకు తీవ్రంగా గాయాలై పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో ఒక ఘటన మరువక ముందే మరో ఘటనలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.


Similar News