అందోల్‌లో 22 నామినేషన్లకు ఆమోదం...

ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

Update: 2023-11-13 14:24 GMT

దిశ, అందోల్‌: ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సోమవారం జోగిపేటలోని రిటర్నింగ్‌ కార్యాలయంలో అందోలు నియోజకవర్గ ఎన్నికల అధికారి పాండు ఆధ్వర్యంలో నామినేషన్ల పరీశీలన ప్రక్రియ జరిగింది. నామినేషన్ల పరీశీలనను ఎన్నికల జనరల్‌ పర్యవేక్షకులు దీపక్‌ సిగ్లా పరీశీలించి, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను, పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఓ పాండు మాట్లాడుతూ... అందోలు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఆయా రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్‌ లు 22 మంది అభ్యర్థులు 38 నామినేషన్‌ సెట్‌లను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు 22 మంది అభ్యర్థులకు సంబంధించిన 22 నామినేషన్ల దరఖాస్తులు సరిగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.

16 నామినేషన్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ దరఖాస్తుపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌ అద్దంకి వీరన్న, అనిల్‌రెడ్డి, న్యాయవాదులు రాంబాబు, శ్రీధర్‌లు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నామినేషన్‌ అఫిడవిట్‌లో కుమారుడి వివరాలను పెట్టకపోవడంతో పాటు 2021–22 సంవత్సరంలో వార్షిక ఆదాయం నిల్‌గా చూపించడంపై వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో, వారి ఫిర్యాదును ఉన్నతాధికారులు దృష్టికి తీసుకేళ్లనున్నట్లు ఆయన తెలిపారు.


Similar News