Medak: వైన్స్‌లో చోరీకి వచ్చి తాగి పడుకున్న దొంగ.. నెట్టింట వైరల్

మద్యం షాపు(Wine Shop)లో దొంగతనానికి(Theft) వచ్చిన ఓ దొంగ మద్యం తాగి షాపులోనే నిద్రపోయిన ఘటన మెదక్ జిల్లా(Medak District)లో జరిగింది.

Update: 2024-12-30 13:03 GMT

దిశ, వెబ్ డెస్క్: మద్యం షాపు(Wine Shop)లో దొంగతనానికి(Theft) వచ్చిన ఓ దొంగ మద్యం తాగి షాపులోనే నిద్రపోయిన ఘటన మెదక్ జిల్లా(Medak District)లో జరిగింది. ఘటన ప్రకారం నార్సింగి(Narsing)లోని కనకదుర్గ వైన్స్(Kanakadurga Wines) లో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగ(Thief) షాపు పైకప్పు ధ్వంసం చేసి లోపలికి వెళ్లాడు. మద్యం షాపు కౌంటర్ లోని నగదుతో పాటు మద్యం బాటిళ్లను కూడా తన వెంట తెచ్చుకున్న సంచిలో మూట కట్టాడు. వచ్చిన పని ముగిసిన తర్వాత మద్యం తాగుతూ.. మత్తులో షాపులోనే నిద్రలోకి జారుకున్నాడు.

యధావిధిగా సోమవారం యజమాని షాపు తెరిచి చూడగా.. వస్తువులు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి మద్యం మత్తులో నిద్రపోయి ఉన్నాడు. అంతేగాక అతని వెంట పెద్ద సంచిలో మూటగట్టిన నగదు మద్యం బాటిళ్లు చూసి షాపు నిర్వహకుడు ఆశ్చర్యపోయాడు. నిద్రపోయిన వ్యక్తి దొంగతనానికి వచ్చాడని గ్రహించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో పడి ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News