అంబర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం

Update: 2024-08-15 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్ పేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం 11 గంటల ప్రాంతంలో  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా అంబర్ పేట లో ఉన్న ఓ పెయింట్స్‌ గోదాంలో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పెయింట్స్‌ గోదాం జనావాసాల మధ్య ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా అప్రమత్తమైన పోలీసులు పెయింట్స్‌ గోదాంకు ఆనుకొని ఉన్న వారిని అక్కడి నుంచి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Similar News