లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపు
షెడ్యూలు విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే 80 శాతం అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు.. ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: షెడ్యూలు విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే 80 శాతం అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు.. ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపు ఇచ్చింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. ‘దగాకోరు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి. బ్రహ్మణీయ, హిందూత్వ ఫాసిస్టు బీజేపీని, దానితో అంటకాగుతున్న పార్టీలన్నింటినీ తన్ని తరమండి. బ్రహ్మణీయ, హిందూత్వ, ఫాసిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడండి. భాతర నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేయండి. ప్రజల విప్లవ రాజకీయాధికారాన్ని స్థాపించండి’ అని లేఖలో పేర్కొన్నారు.
‘2023 నవంబర్‌లో జరిగన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఓట్ల కోసం వేల కోట్లు డబ్బు, మద్యం పంచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికారాన్ని చేపట్టడం కోసం ధనబలం, కండబలం, కుల, మత రాజకీయాలతో సిద్ధమయ్యారు. మతతత్వ రాజకీయాలతో పార్లమెంట్ వ్యవస్థను మరోసారి అపహస్యం చేయడానికి పూనుకున్నారు. అలాంటి స్వార్థ పరులకు ఓటుతో బుద్ధి చెప్పాలి’ అని లేఖలో పిలుపునిచ్చారు.