మన్నె క్రిశాంక్ విచారణ.. రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు.. కీలక విషయాలు వెలుగులోకి!

ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-05 12:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మన్నే క్రిశాంక్‌ను చంచల్ గూడ జైలు నుంచి ఓయూ పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకు ముందు ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్‌కి తరలిచారు. ఈ రోజు నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు కస్టడీలోకి క్రిశాంక్‌ను విచారించనున్నట్లు సమాచారం.

అయితే, విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, క్రిశాంక్ భద్రతపై ఆయన భార్య సుహాసిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు మొత్తం బహిర్గతంగా ఉందని, అలాంటప్పుడు పోలీస్ కస్టడీ అవసరం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ కేసును ఎందుకు పక్క దోవ పట్టిస్తున్నారని నిలదీశారు. ఓయూ పేరుతో ఫేక్ లెటర్‌ని సోషల్ మీడియాలో క్రిశాంక్ సర్క్యూలెట్ చేశారని, ఓయూ ఖ్యాతిని అప్రతిష్టపాలు చేశారని మన్నె క్రిశాంక్‌పై ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News