కాంగ్రెస్ బీ-ఫామ్ దక్కాలంటే ఆ క్వాలిటీ కంపల్సరీ: థాక్రే

బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రెండ్లీ పార్టీలని ప్రజలకు క్లియర్‌గా తెలిసేలా వివరించాలని కాంగ్రెస్​నేతలకు పార్టీ ఇన్‌చార్జీ మాణిక్​రావు థాక్రే పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల తెరచాటు స్నేహన్ని బయట పెట్టాలని వెల్లడించారు.

Update: 2023-05-22 14:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రెండ్లీ పార్టీలని ప్రజలకు క్లియర్‌గా తెలిసేలా వివరించాలని కాంగ్రెస్​నేతలకు పార్టీ ఇన్‌చార్జీ మాణిక్​రావు థాక్రే పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల తెరచాటు స్నేహన్ని బయట పెట్టాలని వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. పార్టీలో పనిచేయనోళ్లకు పదవులు ఉండవని నొక్కి చెప్పారు. బాధ్యతల్ని విస్మరిస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. కష్టపడిన వారికే టికెట్ల పంపిణీ ఉంటుందన్నారు. నేతల పరిచయాలతో గ్యారంటీ ఉండదన్నారు. సర్వేల ఆధారంగానే బీ–ఫామ్‌లు వస్తాయన్నారు. ప్రజల పక్షం నేతలకే టిక్కెట్లు వస్తాయని థాక్రే క్లారిటీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటామన్నారు.

పార్టీలో డిసిప్లేన్ ఉండాలన్నారు. పొరపాటున కూడా పార్టీ డ్యామేజ్ అయ్యే పనులు ఎవరూ చేయకూడదన్నారు. కర్ణాటకలో కష్టపడి గెలిచామని, తెలంగాణలో కూడా గెలుస్తామని థాక్రే థీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సమస్యలపై అన్ని స్థాయిల్లో పోరాట కార్యక్రమాలు చేయాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, అందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలన్నారు. పార్టీ పదవుల్లో ఉండి పని చేయని వాళ్ళపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యత ఇచ్చిన తర్వాతపని చేయలేకపోతే నేరుగా పార్టీలోని ముఖ్యులకు చెప్పాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పని చేయని వారిని పక్కన పెట్టేస్తామన్నారు. అది ఏ స్థాయి లీడరైన పార్టీ వెనకడుగు వేయదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read..

లక్షల కోట్లు వెనకేసుకునేలా ప్రభుత్వం కుట్ర: రేవంత్ రెడ్డి

Tags:    

Similar News