కాంగ్రెస్‌లోకి మరో మాజీ మంత్రి.. రేవంత్ రెడ్డి చర్చలు సక్సెస్
ఎన్నికల నేపథ్యంలో బలమైన నేతలకు కాంగ్రెస్ గాలం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో బలమైన నేతలకు కాంగ్రెస్ గాలం చేస్తోంది. పార్టీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే పలువురు నేతలను పార్టీలో చేర్చుకోగా.. మరికొంతమందితో చర్చలు జరుపుతోంది. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మండవ ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు.
కాంగ్రెస్‌లో చేర్చాల్సిందిగా మండవను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటానని మండవ చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీతో మండవ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్, మండవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో మండవను రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. నిజామాబాద్‌లో బలమైన కమ్మ సామాజిక వర్గ నేతగా మండవకు పేరుంది.
ప్రస్తుతం మండవ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. అందులో భాగంగా మండవను పార్టీలోకి ఆహ్వానించినట్లు రేవంత్ వర్గం చెబుతోంది. త్వరలో కాంగ్రెస్‌లో చేరే విషయంపై మండవ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దాదాపు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరితే నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మండవ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు.