సీఎం రేవంత్ రెడ్డిని మాదిగ జాతి ఎన్నటికీ నమ్మదు: మందకృష్ణ మాదిగ

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ నిర్వహించిన టీచర్ల నియామక పత్రాల పంపిణీపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-10 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ నిర్వహించిన టీచర్ల నియామక పత్రాల పంపిణీపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ మాదిగలకు వ్యతిరేకమని, ఆయనను ఇక మాదిగ సమాజం ఎన్నటికీ నమ్మదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, టీచర్ల నియామక పత్రాల పంపిణీ అంశాలపై ఈ రోజు (గురువారం) మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్ట్‌లుకు నియామకపత్రాలిచ్చారని, ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు జరిగిన అన్యాయమని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బీఆర్ఎస్‌లానే నిర్బంధ పాలన కొసాగిస్తోందని, మాదిగలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మందకృష్ణ ఆరోపించారు.అలాగే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం.. ముందు ఎస్సీ వర్గకరణ చేయాలని, ఆ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘వర్గీకరణ పూర్తయ్యే వరకు గ్రూప్ పరీక్షలు ఆపాలి. వైద్యారోగ్య శాఖలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలి. వర్గీకరణ చేసి మాదిగలకు రావల్సిన పోస్టులను వారికి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలి’’ అని మందకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News